తాడేపల్లి-మంగళగిరి నగర పాలక సంస్థ పరిధిలోని వీజే జూనియర్ కళాశాలలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని కమిషనర్ అలీం బాషా సోమవారం తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 7 ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బందిని నియమించామన్నారు. అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 25 వరకు నాలుగు రోజుల పాటు ఆధార్ సేవా ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు క్యాంపులను ఉపయోగించుకోవాలన్నారు.