మంగళగిరిలో కార్యకర్తలను కలిసిన సీఎం చంద్రబాబు

68చూసినవారు
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనంలో కార్యకర్తలను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారితో ఉత్సాహంగా ఫొటోలు దిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నూతన సంవత్సర రోజు కావడంతో పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్