మంగళగిరి: ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

53చూసినవారు
మంగళగిరి: ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
చెరుకుపల్లి మండలానికి చెందిన సుబ్బయ్య, రాజ్యలక్ష్మి అనువారు గత 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో వారు బుధవారం మంగళగిరిలో పెళ్లి చేసుకున్నారు. మంగళగిరి సీఐ వినోద్ కుమార్ ను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. తాము మేజర్లమని, తమ పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని దీంతో ప్రేమ వివాహం చేసుకున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్