రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26వ తేదీన గుంటూరులో జరిగే మహా ప్రదర్శన, ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు, పిలుపునిచ్చారు. మంగళగిరి సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన ధర్నా, ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.