నరసరావుపేట: పార్కింగ్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే కేసులు: సీఐ

80చూసినవారు
పార్కింగ్ విషయంలో వ్యాపారస్థులు అజాగ్రత్తగా ఉంటే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ లోకనాధం హెచ్చరించారు. నరసరావుపేటలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. తల్లిదండ్రులు మైనర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ బైకులు ఇవ్వొద్దన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బైకులు ఇవ్వాల్సి వస్తే పెద్దలు వారి వెంట వెళ్లేలా చూసుకోవాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దేందుకు ప్రజలు పోలీసులకి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్