రీ సర్వే పేరుతో అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు గురువారం నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామ సచివాలయం వద్ద బాధితులతో కలిసి వారు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన మెమొరాండం సచివాలయ రెవెన్యూ ఇంచార్జి రఘుకి అందజేశారు. గత ప్రభుత్వంలో రి సర్వే పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ఒకరి భూములు మరొకరకు నమోదు చేశారని అన్నారు.