ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహణ

78చూసినవారు
ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహణ
ఒంగోలులోని ఈద్గాలో గురువారం రంజాన్ ప్రార్థనలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు బుధవారం రాత్రితో ముగిశాయి. దీంతో గురువారం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు ఇంటి వద్ద ప్రార్ధనలు చేశారు.

సంబంధిత పోస్ట్