మార్టూరులో పిసిసి అధ్యక్షురాలు షర్మిల సందడి

578చూసినవారు
మార్టూరులో పిసిసి అధ్యక్షురాలు షర్మిల సందడి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం రాత్రి కాసేపు మార్టూరులో సందడి చేశారు. గుంటూరు పర్యటన ముగించుకొని ఆమె నెల్లూరు జిల్లా పర్యటనకి జాతీయ రహదారిపై వెళ్తూ విశ్రాంతి కోసం ఇసుకదర్శిలో ఆగారు. ఈ సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆమె చుట్టూ మూగారు. సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. షర్మిల కూడా వారితో సరదాగా మాట్లాడుతూ స్థానిక రాజకీయాల గురించి ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్