75 త్యాళ్ళూరు హైస్కూల్లో ముగిసిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

82చూసినవారు
75 త్యాళ్ళూరు హైస్కూల్లో ముగిసిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
పెదకూరపాడు మండలం 75‌త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో శనివారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది‌. ఉపాధ్యాయులు విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు అందజేసి వివిధ రంగాలలో వారి ప్రగతిని వివరించారు. తల్లులకు రంగూలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ‌తర్వాత అందరూ కలిసి వివిధ అంశాల మీద చర్చ జరిపారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ కార్యక్రమం ముగిసింది.

సంబంధిత పోస్ట్