పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు హైస్కూల్లో ఐదు లక్షల రూపాయలతో కీ.శే ఉమాసుందరి జ్ఞాపకార్ధం ఆమె భర్త ఎస్. లీలాప్రసాద్ రెడ్డి, కుమారులు మనోదిలీప్ రెడ్డి, రాజీవ్ రెడ్డిలు నిర్మించిన నూతన మినరల్ వాటర్ ప్లాంటును వారి కుటుంబ సభ్యులు సోమవారం ప్రారంభించారు. దీనిలో జి. శివసుందర రెడ్డి, ప్రొఫెసర్ డేవిడ్ రాజు ఎంఇఓ టి. సత్యనారాయణ, హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పున్నారావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.