విశాఖ ఉక్కుపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా పనిచేస్తుందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారము అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ. 11, 500 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.