పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన అని పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. ఆయన పెదకూరపాడు తమ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఎటువంటి పెట్టుబడులు రాక ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని, చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సు హాజరయ్యారని అన్నారు.