పెదకూరపాడు: మూల మలుపుల్లో ప్రమాదాలు ఎన్నో..!

70చూసినవారు
పెదకూరపాడు మండల పరిధిలోని కాశిపాడు రోడ్డు నుంచి బలుసుపాడు వెళ్లే సమీపంలో ఉన్న మూలమలుపు ప్రమాదభరితంగా ఉందని వాహనదారులు తెలిపారు. గతంలో టాటా ఏసీ బోల్తా పడి ఈ మూలమలుపులోనే ఒకరు మృతి చెందారని తెలిపారు. గత ఆరు నెలల క్రితం గేదలు అడ్డు వచ్చి ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయని స్థానిక ప్రజలు, వాహనదారులు తెలిపారు. మూలమలుపులో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారించాలని వాహనదారులు మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్