గత మూడు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు అమరావతి మండలం స్థానిక అమరావతి వరద నీరుతో మునిగిపోయింది. పల్లపు ప్రాంతాలైన ఏ వీధి చూసినా నడుముల లోతు నీళ్లు దర్శనమిస్తున్నాయి. నలు దిక్కుల నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనాలు స్తంభించిపోయాయి. వరద రాకతో భయం గుప్పెట్లో ప్రజలు సోమవారం కొట్టుమిట్టాడుతున్నారు. పునరావాస కేంద్రాలకు ప్రభుత్వ అధికారులు తరలిస్తున్నారు. ధ్యాన బుద్ధ మందిరం మొత్తం జలమయమైంది.