దారుణం.. భార్య గొంతుకోసి పరారైన భర్త

11167చూసినవారు
దారుణం.. భార్య గొంతుకోసి పరారైన భర్త
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెదకాకానిలోని వెంగళరావు నగర్ లో నివాసముంటున్న సయ్యద్ షామీర్, తస్లీమా మూడేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇటీవల తరచుగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలోనే సయ్యద్ తన భార్య తస్లీమా గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు తస్లీమాను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్