కాకుమాను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిమండల తహసీల్దార్ బి. వెంకటస్వామి, ఏవో కిరణ్మయి మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సకాలంలో సేవలు అందించాలని సూచించారు. సాధారణ రకము(కామన్) క్వింటా రూ. 2300, 75 కేజీలు రూ. 1725, గ్రేడ్ 'ఎ 'రకము క్వింటా రూ. 2320, 75 కేజీ లు1740 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని వారు మీడియాకు తెలిపారు.