గుంటూరు జిల్లా కాకుమాను మండలం పాండ్రపాడు గ్రామంలో గురువారం మండల తహసిల్దార్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో గ్రామంలోని ప్రజలు వివిధ భూ సమస్యలపై నాలుగు అర్జీలు అందించినట్లు తహసిల్దార్ వెంకటస్వామి తెలిపారు. సత్వర భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవిన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రత్యేక అధికారి మోహన్ రావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.