తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో గురువారం జరిగాయి. కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.