ప్రత్తిపాడు మండల యనమదల గ్రామంలో శనివారం తెల్లవారుజామునకొండ్రుపాడు డొంకవైపున ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానం వెనుక ఉన్న ఇంటివద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇరువురు వ్యక్తులు ఇంటి ముందు ఉంచిన వాహనాన్ని తీసుకెళ్లిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇంటి యజమానులు శనివారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.