అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరమైన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడంపై నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకుడు కనకం శ్రీనివాసరావు స్వాగతించారు. సోమవారం సత్తెనపల్లిలో బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయ రంగానికి, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పేట వేసిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమ పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.