తెనాలి పట్టణంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవికి వ్యతిరేకంగా శుక్రవారం హిందూ చైతన్యవేదిక ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ మేరకు మాధవి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎమ్మెల్యే మాధవి ఇస్కాన్ భక్తులను భగవద్గీత పుస్తకాలు విక్రయించకుండా అడ్డుకోవటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను చులకనగా చూడొద్దంటూ హితవు పలికారు.