ఆంధ్రాప్యారిస్ తెనాలి నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్దమవుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి మార్కెట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. బేకరీలు, స్వీట్ షాపుల వద్ద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేపట్టారు. వెరైటీ డిజైన్లతో కేక్ లు ఆకట్టుకుంటున్నాయి. బొకేలు పూల కొట్ల వద్ద సందడి కనిపించింది.