మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 23న గుంటూరులో పర్యటించనున్నారని పార్టీ కార్యాలయ వర్గం సోమవారం తెలిపింది. రౌడీ షీటర్ నవీన్ దాడి కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తెనాలికి చెందిన యువతిని ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె కుటుంబాన్ని కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకుని భరోసా కల్పించనున్నారు.