తెనాలి: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి తిరిగి రావడం లేదని ఓ వ్యక్తి పురుగు మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు తెనాలి పట్టణంలోని ఐతానగర్‌కు చెందిన రాజేశ్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఆమె కాపురానికి రావకపోవడంతో రాజేశ్ పురుగు మందు తాగాడు. తెనాలి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.