కృష్ణానది పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలవల్ల ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో దిగువ ప్రాంతాలకు వరద వచ్చే ప్రమాదం ఉంది కనుక రైతులు అప్రమత్తంగా ఉండాలని కొల్లూరు మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల పరిధిలోని లంక గ్రామాల రైతులకు పలు సూచనలు చేశారు. వరద తాకిడికి గురయ్యే వ్యవసాయ భూములలో ఉన్న విద్యుత్ మోటార్లను మేరక ప్రాంతానికి తరలించుకోవాలన్నారు.