అమృతలూరు మండల పంచాయతీ విస్తరణఅధికారి మరియు రేపల్లె ఇన్ ఛార్జ్ డిఎల్పిఓ గొట్టిముక్కల నరసింహారావు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. నరసింహారావు మృతదేహానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పూలమాలవేసి నివాళులర్పించారు. సౌమ్యుడు, మంచి అధికారిగా పేరు ఉన్న నరసింహారావు మృతి తీరని లోటని ఆనందబాబు అన్నారు. గుంటూరులోని ఆయన స్వగృహంలో మంగళవారం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.