త్వరలో అన్ని హామీలన్నీ అమలు చేస్తామని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. చుండూరు మండలం మండూరు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని, నేడు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు.