బ్రాహ్మణపల్లి మైనర్ కాలువలో పేర్కొన్న చెత్తను తొలగించి మరమ్మతులు చేపట్టారు. కాలువ ద్వారా చివరి భూముల వరకు సాగునీరు అందించాలని కోరుతూ ఈనెల 21వ తేదీన పిడిఎం ప్రజా సంఘాల ప్రతినిధులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్పి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ హేమంత్ కుమార్ స్థానిక స్థాయిలో గుడి వద్ద గల మైనర్ కాలువ ప్రాంతాన్ని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.