పశు సంవర్ధక శాఖ ద్వారా రైతులకు, గొర్రెలు మరియు మేకల పెంపకం దారులకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు తెలిపారు. వినుకొండ మండలంలోని నడిగడ్డ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన పేర్కొన్నట్లు రైతుల ఆర్థికాభివృద్ధి కోసం మినీ గోకులం యూనిట్ల మంజూరు, పశుగ్రాసం ఉత్పత్తి కోసం నిధుల మంజూరు జరుగుతోంది.