వినుకొండ మండలం చీకటిగలపాలెం అడ్డరోడ్డు సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. స్థానికుల వివరాల మేరకు. చీకటిగలపాలెం అడ్డరోడ్డు సమీపంలో బ్రిడ్జి మీద బోలేరో వాహనం పంచర్ అయింది. పంచర్ వేసుకుంటుండగా, వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.