కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగువారికే రావడం గర్వకారణమని బుధవారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రముఖ అభ్యుదయకవి, సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలుగువారికి, పల్నాడు జిల్లా వినుకొండకు గర్వకారణమని జీవీ అన్నారు.