AP: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ మేరకు ఈదులబయలు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జీపులో పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. సుమారు రూ.20 లక్షల విలువైన 400 కేజీల గంజాయి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న జీపును సీజ్ చేసి.. నలుగురిని అరెస్ట్ చేశారు.