ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐక్యూ 12కు కొనసాగింపుగా ఐక్యూ 13ను మంగళవారం భారతీయ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇందులో ఫీచర్లను గమనిస్తే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. అలాగే వెనకవైపు 50mp ప్రధాన కెమెరాతో పాటు అదనంగా రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు. ముందు 32mp కెమెరా ఇవ్వగా బ్యాటరీ 6000 mah ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే రూ. 12GB+256GB రూ.54,999గా ఉంది.