అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

50చూసినవారు
అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
AP: అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. తుని శ్రీ చైతన్య కాలేజీలో సృజన (17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గురువారం ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినప్పటి నుంచి డల్‌గా ఉందని, ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్