TG: రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) రాగన్నగూడకు చెందిన దోసాడ సుష్మ గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు భర్త రామకృష్ణారెడ్డి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మంచిగా స్థిరపడ్డ కుటుంబం. కానీ సుష్మ ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు స్థానికంగా కలకలంగా మారింది. సుష్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావచ్చు.