AP: వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో బంగాళాఖాతంలో 2 వారాల వ్యవధిలోనే 3 అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 17న ఒకటి ఏర్పడగా.. అది తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. అండమాన్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన మోడల్ అంచనా వేసింది. వీటి ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.