AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 48 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.