AP: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ - టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఓ కారు ధ్వంసమైంది. గతేడాది టీడీపీ నేత గిరినాథ్ చౌదరి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం వైసీపీకి చెందిన 36 మంది నిందితులు గ్రామం వదిలి పారిపోయారు. హైకోర్టు అనుమతితో నిందితులు నేడు బొమ్మిరెడ్డిపల్లికి రావడంతో వారిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఘర్షణ తలెత్తింది.