AP: అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఆయన కుటుంబంపై రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై 15 రోజుల క్రితం జిల్లా ఎస్పీ జగదీశ్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.