టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులో చేరారు. ఇంగ్లాండ్‌తో 22వ తేదీ నుంచి జరిగే టీ20 సిరీస్‌లో ఆయన ఆడనున్నారు. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్‌కు భారత్ జట్టు చేరుకుంది. వారితో కలిసి షమీ నెట్స్‌లో సాధన చేశారు. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన అతడికి సహచర ఆటగాళ్లు స్వాగతం పలికారు. అనంతరం ఫ్యాన్స్‌కు ఆటో గ్రాఫ్ ఇచ్చారు. ‘షమీ ఈజ్ బ్యాక్’ అంటూ ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.