పేదలకు చంద్రబాబు బిగ్ న్యూస్..!

1050చూసినవారు
పేదలకు చంద్రబాబు బిగ్ న్యూస్..!
ఏపీలో తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిపై వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో వైసీపీ హయాంలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానులు తెరపైకి తీసుకురావడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందులో విజయవాడ, గుంటూరులోని పేదలకు అమరావతి రాజధానిలో ఆర్5 జోన్ పేరిట ఓ జోన్ ఏర్పాటు చేసి అందులో ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఆర్5 జోన్ ఏర్పాటు చేసి అందులో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్ని రద్దు చేసి లబ్దిదారులకు విజయవాడ, గుంటూరులోనే స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్