ఒంగోలు దాడిపై వైసీపీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డ చంద్రబాబు

73చూసినవారు
ఒంగోలు దాడిపై వైసీపీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డ చంద్రబాబు
ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ దాడిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. రౌడీయిజం చేయకపోతో పూట గడవదు అన్నట్లు వైసీపీ వ్యవహార తీరు ఉందన్నారు. టీడీపీ కార్యకర్త ప్రభావతి కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించింది. వాలంటీర్ ని ప్రశ్నిస్తే చంపేస్తారా ? ఆమెకు అండగా నిలిచిన మోహన్ రావుపై అరాచకంగా దాడి చేశారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే అక్కడా బీభత్సం సృష్టించారు. దాడి సమయంలో అక్కడే ఉండి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయని పోలీసులపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్