నోరో వైరస్ వల్ల వ్యాధి లక్షణాలు వికారంగా అనిపించవచ్చు. ప్రధానంగా వాంతులు, కడుపునొప్పి, నీళ్ల విరేచనాలు, నోరు చేదుగా అనిపించడం, జ్వరం, కండరాల నొప్పులు, గొంతు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు డీహైడ్రేషన్ కలగవచ్చు. దీంతో కన్నీళ్లు కూడా బయటికి రావు. ఈ లక్షణాలు తీవ్రతకు, డీహైడ్రేషన్‌కి కారణమవుతాయి.