భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో మునుపటి డిప్యూటీ గవర్నర్ ఎండీ రాజీనామా చేయడంతో ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. ఆమె ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్నారు. ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. 1998లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంలో ఆమె పిహెచ్‌డి పరిశోధనకు ఎగ్జిమ్ బ్యాంక్ బహుమతిని కూడా అందుకున్నారు.