AP: సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయన్నారు. 'చంద్రబాబుకి అన్ని తెలుసు ..కానీ కావాలనే మోసం చేసాడు. పీ4 అనే కొత్త మోసాన్ని మొదలు పెట్టారు. హామీల ఎగ్గొట్టడానికి అప్పులపై అబద్దాలు చెబుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అడిగితే రాష్ట్రం అప్పుల పాలైందంటాడు. చివరికి ప్రజలు చంద్రబాబు సభల నుంచి వెళ్లిపోతున్నారని' జగన్ విమర్శలు చేశారు.