AP: విశాఖపట్నం మధురవాడలో ఓ యువతిపై యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అలాగే బాధితురాలు నక్క దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.