AP: చంద్రబాబు రాష్ట్రానికా? టీడీపీకి ముఖ్యమంత్రా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 'ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసానిని అరెస్ట్ చేయడం దారుణం. అక్రమంగా 111 కేసు పెట్టి, అక్రమంగా ఇరికించారు. ప్రధాని మోడీని కించపరుస్తూ చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ మాట్లాడారు. వారిపై కేసు నమోదు చేయగలరా?’ అని ప్రశ్నించారు. మీది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమన్నారు.