ఆగస్ట్ పెన్షన్లపై చంద్రబాబు కీలక నిర్ణయం!

2924చూసినవారు
ఆగస్ట్ పెన్షన్లపై చంద్రబాబు కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ సకాలంలో ఆగస్టు పింఛన్ అందేలాగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పింఛన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా పక్కాగా జరగాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఆగస్టు నెల ఒకటవ తేదీ ఉదయం 6గంటలకు పింఛన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పింఛన్ పంపిణీ ప్రక్రియకోసం సిబ్బందిని కేటాయించి లబ్ధిదారులకు పింఛన్ అందించే కసరత్తును ప్రభుత్వ యంత్రాంగం చేస్తోంది.

సంబంధిత పోస్ట్