టాలీవుడ్ నటుడు, కమెడియన్ వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాద్యాసం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌లో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం వెల్లడిస్తూ ఓ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.