ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను రేపటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 12, 12ఆర్, నార్డ్ 4 వంటి స్మార్ట్‌ఫోన్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్స్‌తో పాటు, బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 12పై ఫోన్ పై రూ.6వేలు ఫ్లాట్ డిస్కౌంటుతో పాటు ఐసీఐసీఐ, వన్‌కార్డ్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు రూ.7వేలు డిస్కౌంట్ పొందవచ్చు.